బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన శృతిహాసన్.. మింగిల్ అయ్యేందుకు రెడీగా ఉన్నా అంటూ..?!

సౌత్ స్టార్ బ్యూటీ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్.. శాంతాన్ హజారికా తో చాలా కాలం డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ప‌లు మీడియా నివేదికల ప్రకారం వారిద్దరూ ఒకరి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకరు అన్ ఫాలో చేసుకోవడం ఈ వార్తలకు పునాది అయింది. కరోనా లాక్ డౌన్ టైం లో శృతి, శాంతాన్‌ ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తూ.. ఇద్దరు మొంబైలో సహజీవనం చేశారు.

తరచుగా శృతిహాసన్ వీడియోల‌లో, సోషల్ మీడియాలో త‌మ ప‌ర‌స్న‌ల్ విష‌యాల‌ను కూడా షేర్ చేసుకుంటూ అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యేది. ఈ క్ర‌మంలో తాజాగా శృతిహాసన్ వారిద్దరి రిలేషన్ షిప్ పై తన ఇన్స్టా స్టోరీతో క్లారిటీ ఇచ్చింది. వాస్తవానికి అభిమానుల‌తో కమ్యూనికేట్ చేయడానికి గురువారం ఆస్క్ మీ సంథింగ్ సెషన్‌ ప్రారంభించింది శృతి. ఈ చాట్ సెషన్ లో చాలా ఎన్నో ప్రశ్నలకు శృతిహాసన్ ధైర్యంగా ఆన్సర్ చేసింది.

Shruti Haasan speaks about her breakup with Shantanu Hazarika | Filmfare.com

ఇందులో భాగంగా ఓ అభిమాని ఆమె రిలేషన్‌షిప్ గురించి ప్రశ్నించగా నాకు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇష్టం ఉండదు.. కానీ నేను పూర్తిగా ఒంటరిగా ఉన్న.. మింగిలావ్వాలని చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను వర్క్ లో బిజీగా ఉన్నా.. నా లైఫ్‌ను ఆశ్వాదిస్తున్న అంటూ కామెంట్స్ చేసింది. శృతి చేసిన ఈ కామెంట్స్‌తో వీరి బ్రేక‌ప్ న్యూస్ పై క్లారిటీ వ‌చ్చేసింది.