ఆ యంగ్ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చిన నాగార్జున.. ఈసారి కూడా హిట్ పక్కా..?!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నాగార్జున కొత్తవాళ్లను పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఆయన ద్వారా ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకులు లిస్ట్ చాలా ఎక్కువ. ఇటీవల నా స్వామి రంగా సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ని కూడా దర్శకుడుగా వెండి తెరకు పరిచయం చేశాడు నాగార్జున. ఈ సినిమా సంక్రాంతికి రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా కు ముందు వ‌ర‌కు నాగ్‌కు వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో నా సామిరంగ స‌క్స‌స్ నాగార్జున ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

Akkineni Nagarjuna Archives | Telugu360.com

ఇక ప్రస్తుతం నాగ్‌ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న కుబేర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక నాగార్జున హీరోగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో మొదలైంది. దానికి సమాధానంగా మళ్ళీ విజయ్ బినీతోనే ఆయన సినిమా చేస్తున్నారంటూ తెలుస్తుంది. ఇటీవల విజయ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి వార్తలు వినిపించాయి.

Vijay Binni Archives - NTV ENGLISH

ఇక‌ వీరిద్దరూ కలయికలో సంక్రాంతికి వచ్చిన నా సామిరంగా సినిమా మలయాళం రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు వీరిద్దరూ సొంత కథతో సినిమా తరకెక్కించనున్నారట. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని టాక్. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందని నెటింట‌ వార్తలు వైరల్ అవ్వడంతో.. నాగార్జున ఫ్యాన్స్ ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాయమంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.