మరోసారి ఇలా చేస్తే నేనే లీగల్ నోటీసులు ఇస్తా.. శ్రీకాంత్ స్ట్రాంగ్ వార్నింగ్..?!

బెంగళూరు రేవ్‌ పార్టీ గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీ విషయంలో పోలీసులు తీగలాగుతున్న కొద్ది డొంక‌ కదులుతుంది అన్నట్లు సంచలన విషయాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో డ్రగ్స్, గంజాయి వాడుతున్నారంటూ అనుమానంతో పోలీసులు వారి బ్లడ్ శాంపిల్స్ ను స్వీకరించగా అందులోను డ్రగ్స్ ఆన‌వాళ్ళు క‌నిపించాయి. దాదాపు 103 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు క్లారిటీ వచ్చింది. ఈనెల 18న సన్ సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో రేవ్ పార్టీ జరగగా ఈ కేసులో పలువురి ముద్దాయిలుగా తేల్చారు. అలాగే 14 గ్రాముల ఎండిఎంఏ, 5 గ్రాములకు భారీ మొత్తంలో గంజాయిని సీజ్‌ చేసి.. రెండు ఖరీదైన కార్లు, 14 విలువైన డిజే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు రేవ్‌ పార్టీకి వెళ్లలేదంటూ నటుడు శ్రీకాంత్ వీడియో | Tollywood actor Srikanth on bangalore rave party

హెబ్బాగోడి పిఎస్ నుంచి సిసిబికి కేసు ట్రాన్స్ఫర్ చేశారు. కాగా ఆ 86 మందిలో 59 మంది పురుషులు, 27 మంది యువతులు, మహిళలు ఉన్నారని వెల్ల‌డించారు. వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉండడం గమనార్హం. హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని పోలీసులు వివరించారు. బ్లడ్ రిపోర్టులో పాజిటివ్గా వచ్చిన వ్యక్తులకు సిసిబి నోటీసులు ఇవ్వనుందట‌. ఈ రేవ్ పార్టిలో పాల్గొన్న చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారంటూ వివరించారు. అయితే ఇటీవల టాలీవుడ్ బ్యూటీ ఆషీ రాయ్ మాత్రం అక్కడ ఏం జరిగిందో నాకు నిజంగానే తెలియదని.. కేవలం కేక్ మాత్రమే నేను తినివచ్చానని.. పోలీసులకు నా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చాను అంటూ వివరించింది.

Hero Srikanth Strong Reaction Over Spreading Fake News On Him About Bangalore Rave Party | Tollywood

ఇదిలా ఉంటే ఈ పార్టీలో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా పాల్గొన్నారంటూ వార్తలు వినిపించాయి. దీనిపై శ్రీకాంత్ స్పందిస్తూ పాబ్‌కల్చర్లు నాకు అలవాటు లేదు.. నేను ఎటువంటి రేవ్ పార్టీలోను పాల్గొనలేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఓ వ్యక్తి అచ్చం తన‌లానే ఉండడంతో అందరూ నేను అనుకుని భ్రమపడ్డారని.. తనపై వస్తున్న వార్తలు నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు శ్రీకాంత్ కు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ మరోసారి వార్తలు పుట్టుకొచ్చాయి. దానిపై కూడా శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాకు ఏ నోటీసులు రాలేదు.. నాపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే నేనే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.