దర్శకుడుగా మారనున్న మరో జబర్దస్త్ కమెడియన్.. హీరో ఎవరంటే..?!

బుల్లితెర బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్ గా మారిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ఇప్ప‌టికే చాలామంది సాధారణ వ్యక్తులకు.. సినీ ఇండస్ట్రీలో మంచి లైఫ్ ఇచ్చింది. హీరోలుగా, డైరెక్టర్లుగా, సపోర్టింగ్ రోల్స్‌లో, టెక్నీషియన్ గా ఇలా ఎన్నో విభాగాల్లో జబర్దస్త్ కమెడియన్లు దూసుకుపోతున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుదీర్. గెటప్ శీను ఏకంగా హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

Jabardasth Auto Ram Prasad | డైరెక్టర్‌గా మారబోతున్న మరో జబర్దస్త్‌  కమెడియన్‌.?-Namasthe Telangana

ఇక వేణు యెల్దండి బలగం సినిమాతో ఆల్రెడీ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ధనరాజ్ రావం.. రాఘవంతో డైరెక్టర్ మార‌నున్నాడు. వీరితోపాటు జబర్దస్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్, రాకెట్ రాఘవ లాంటివారు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. అయితే వేణు, ధనరాజ్ లానే ఇప్పుడు మరో స్టార్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కూడా.. మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారాలని ప్రయత్నంలో ఉన్నాడు.

Getup Srinu: డైరెక్టర్ కానున్న మరో జబర్దస్త్ కమెడియన్.. సుధీర్ – గెటప్  శ్రీనులతో సినిమా? - NTV Telugu

తనదైన ఆటో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఆటో రాంప్రసాద్.. త్వరలోనే డైరెక్టర్ గా మారి ఓ మంచి కథతో సినిమా తీయాలని భావిస్తున్నాడట. ఇక రాం ప్ర‌సాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్క్రీన్ లోను వీరు మంచి స్నేహితులు. దీంతో ప్రస్తుతం హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సుధీర్, గెటప్ శీను లను హీరోలుగా పెట్టి కామెడీ ఎంటర్టైనర్‌ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట రాంప్రసాద్. నిర్మాతలకు కథ నచ్చితే త్వ‌రలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుందని అధికారకంగా అనౌన్స్మెంట్ ఇస్తామంటూ వివరించాడు.