“ఆ హీరోతోనే సినిమా ఎంట్రీ”..కన్ఫామ్ చేసిన సితార..మహేశ్ ఫ్యాన్స్ కి పండగే..!

సితార.. ఘట్టమనేని వారసురాలు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ముద్దుల కూతురు. త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు మహేష్ బాబు నమ్రతాలు కూడా సితార ఇష్టప్రకారమే నడుచుకుంటామంటూ పలు ఇంటర్వ్యూస్ లలో చెప్పుకు వచ్చిన విషయం తెలిసిందే . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది సితార. తనదైన స్టైల్ లో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ క్యూట్ గా ఆన్సర్ ఇచ్చింది .

మరీ ముఖ్యంగా జనాలకి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. కాగా తాజా ఇంటర్వ్యూలో సితార మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . రీసెంట్గా మహేష్ బాబు = మంజుల హెయిర్ టచింగ్ వీడియో ఎంత వైరల్ అయిందో మనం చూసాం. దాని గురించి సితార స్పందిస్తూ ..”మా డాడీకి హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం ఆ కారణంగానే అత్త టచ్ చేయగానే వద్దు తాకద్దు అని చెప్పాడు “అంటూ చెప్పుకొచ్చింది .

అంతేకాదు ..”నాకు మా అన్నయ్య గౌతమ్ ని ఏడిపించడం చాలా చాలా ఇష్టం అంటూ చాలా క్యూట్ గా ఆన్సర్ ఇచ్చింది”. త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని పరోక్షకంగా కన్ఫామ్ చేసింది. గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ తో సితార ఎంట్రీ ఉంటుంది అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇప్పుడు సితార మాటలు బట్టి చూస్తే అది నిజమే అనుకుంటున్నారు జనాలు . అదే జరిగితే మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పడంలో సందేహం లేదు..!!