మనం@10 ఏళ్లు: సమంత రోల్ ని మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

“మనం”.. అక్కినేని ఫ్యాన్స్ కు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి తో పాటు అక్కినేని నాగార్జున ..అక్కినేని నాగచైతన్య ..అక్కినేని అఖిల్.. అక్కినేని అమల కలిసిన నటించారు. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యామిలీ ఏ స్థాయిలో కష్టపడ్డారో కూడా మనకు తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోస్ కూడా వేసింది అక్కినేని ఫ్యామిలీ . సినిమా రీ రిలీజ్ చేసింది .

థియేటర్స్ లో మనం సినిమా రిలీజ్ రెస్పాన్స్ రేంజ్ లో అద్దిరిపోతుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్య – సమంతల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కి కెవ్వు కేక రేంజ్ లో అరుపులు వినపడుతున్నాయి . ఈ క్రమంలోనే మనం సినిమాలో సమంత పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ పేరు ట్రెండీ గా మారింది . నిజానికి ఈ సినిమా అసలు అక్కినేని ఫ్యామిలీ చేయాల్సింది కాదు .. సిద్ధార్ధ్ – వెంకటేష్ – విశ్వనాథ్ గారు ప్రధాన పాత్రలో తరికెక్కాల్సింది.

కానీ విక్రమ్ కుమార్ లాస్ట్ మినిట్ లో ఈ సినిమాని అక్కినేని ఫ్యామిలీ కోసం అక్కినేని ఫ్యామిలీ చేతిలో పెట్టాడు. అయితే నిజానికి ఈ సినిమాలో సమంత ప్లేస్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నారట . అయితే నాగచైతన్య స్పెషల్ రిక్వెస్ట్ పేరు మీదకే సమంతను ఈ రోల్ కి తీసుకున్నారట . ఏ మాటక ఆ మాట ఈ రోల్ లో సమంత తప్పిస్తే మిగతా ఏ హీరోయిన్ నటించిన పెద్దగా అందగించేది కాదు అంటున్నారు జనాలు. ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలను అదే విధంగా హాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు..!!