బిజీ షెడ్యూల్ లోను టైం సెట్ చేసి మరి విజయ్ దేవరకొండను కలిసిన ప్రశాంత్ నీల్.. ఎందుకో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే ఇట్టే సెకండ్స్ లో వైరల్ అయిపోతూ ఉండడం మనం గమనిస్తున్నాము. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు గురించి అయితే చీమ చట్టుకుని కొట్టిన సరే సెకండ్స్ లోనే సోషల్ మీడియాలో ఆ న్యూస్ లీక్ అయిపోయి వైరల్ గా మారుతుంది. తాజాగా అలాంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ను రీసెంట్గా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిశారు.

దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి . పాన్ ఇండియా డైరెక్టర్ గా పబ్లిసిటీ పాపులర్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్.. ఇలా విజయ్ దేవరకొండను కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. విజయ్ దేవరకొండ మేనేజర్ తో ప్రశాంత్ నీల్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. విజయ్ దేవరకొండ ..ప్రశాంత్ నీల్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యారట.

అయితే అది సలార్ 2 నా..? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమా కోసమా ..? అనేది తెలియడం లేదు . ఈ విషయంపై క్లారిటీ వస్తే ఇక రచ్చ రంబోలనే అంటున్నారు ఆ రౌడీ హీరో ఫ్యాన్స్ . చూద్దాం మరి రౌడీ హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? ప్రశాంత్ నీల్ ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే.. పాన్ ఇండియా డైరెక్టర్ లాంటి ఆయన బిజీ షెడ్యూల్ లోను విజయ్ దేవరకొండ కోసం టైం కేటాయించి ఆయన స్వయంగా వెళ్లి మరి కలవడం ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ప్రాధాన్యత సంతరించుకుంది..!