ఆ విషయంలో మహేశ్ కన్నా.. చరణ్ నే 1000 రెట్లు బెటర్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒళ్లు మండిస్తున్న న్యూస్..!

సోషల్ మీడియాని అంటే అంతే.. ఎక్కడ పాసిటివిటీ ఉంటుందో అక్కడ నెగెటివిటీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ పొగిడే జనాలు ఉంటారో.. అక్కడ బూతులు తిట్టే మనుషులు కూడా ఉంటారు . ఈ విషయాన్ని తెలుసుకొని మనకు మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో మహేష్ బాబు – రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది. స్టార్ హీరోలు బాగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాల మాటలతో యుద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు ఆ విషయంలో ఫ్లాప్ అని రామ్ చరణ్ పెద్ద తోపు అని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు .

దీనిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే . అయితే రాజమౌళి దర్శకత్వం తర్వాత కూడా మహేష్ బాబు తెలుగు డైరెక్టర్లకి కమిట్ అవ్వడం గమనార్హం. ఈ క్రమంలోనే మహేష్ బాబుకి అంత సత్తా లేదు అని పక్క భాష డైరెక్టర్ లతో చేస్తే ఆయన కెరియర్ కొలాప్స్ అవుతుంది అని.. ఆల్రెడీ తమిళ్ డైరెక్టర్ లతో రెండు సార్లు సినిమాలు చేసి బొక్క బోర్ల పడ్డారు అని ..

కానీ రాంచరణ్ మాత్రం అలా కాదు అని.. సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయిన ధైర్యంగా నమ్మి అక్కడ డైరెక్టర్లకు అవకాశం ఇస్తాడు అని.. అందుకే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి అవకాశం ఇచ్చాడు అని చెప్పుకొస్తున్నారు . ఈ సినిమా ఫ్లాప్ అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది . అయినా సరే రాంచరణ్ ఎక్కడా తగ్గకుండా తన పని తాను చేసుకోపోతున్నాడు .. ఆ విషయంలో మహేష్ బాబు కంటే రామ్ చరణ్ 1000రెట్లు బెటర్ అంటున్నారు జనాలు . దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మండిపోతుంది. చూద్దాం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం అంటూ రీకౌంటర్స్ వేస్తున్నారు మహేశ్ అభిమానులు..!!