బన్నీ నెక్స్ట్ సినిమా ఎవ్వరితోనో తెలిసిపోయిందోచ్.. మీరు అనుకున్న డైరెక్టర్ అస్సలు కాదు..!

చాలామంది స్టార్ హీరోల నెక్స్ట్ సినిమా ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు మన ఇండస్ట్రీలో చాలా మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. అదే విధంగా డైరెక్టర్లు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప2 సినిమా పైనే పడ్డాయి . ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా ..? అంటూ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు .

అయితే పుష్ప2 సినిమా తరువాత బన్ని కమిట్ అయ్యే డైరెక్టర్ ఎవరు అంటూ పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. కొందరు అట్లీ అంటుంటే మరికొందరు కాదు కాదు త్రివిక్రమ్ అంటున్నారు . ఫైనల్లీ ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది . బన్నీ నెక్స్ట్ చేయబోయే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తోనే . అయితే ఈ సినిమా చాలా చాలా స్పీడ్ గా తెరకెక్కించాలి అని డిసైడ్ అయ్యారట .

కేవలం మూడు నాలుగు నెలల్లోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ కూడా చేసేయాలి అంటూ ఫిక్స్ అయిపోయారట . అల్లు అర్జున్ సినిమా కోసం హ్యూజ్ కాల్ షీట్స్ బుక్ చేసుకున్నారట అట్లీ . అల్లు అర్జున్ తో సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది అని .. ఆ కారణంగా ఆ సినిమాకి చాలా చాలా టైం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని.. త్రివిక్రమ్ ది ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ లాంటి కథ కావడంతో సదాసీదాగాతెరకెక్కించేసిన ప్రాబ్లం లేదు అని అభిప్రాయపడుతున్నారట . దీంతో నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలోనే బన్ని నటించబోతున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!