టమాటో దోస ఎప్పుడైనా ట్రై చేశారా?.. ఇలా చేసుకుని తింటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!

టమాటోలు, మినప్పప్పు, బియ్యం, నీళ్లు, ఇంగువ, ఎండు మిరపకాయలు, నూనె సరిపడా, ఉప్పు తగినంత ఈ పదార్థాలు తీసుకోవాలి. ఈ దోస తయారు చేయటానికి ముందుగా మినప్పప్పు, బియ్యాన్ని బాగా కడిగి ఒక పాత్రలో నీళ్లు పోసి దాదాపు 2 గంటల పాటు నానబెట్టాలి.

తరువాత నీరు లేకుండా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పప్పు, బియ్యం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విశ్రమానికి ఇంగువ, ఎండు మిరపకాయలు, టమాటోలు, ఉప్పు వేసి దోస పిండిలా మెత్తగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ పిండిని రెండు గంటల పాటు నాననివ్వాలి.

అప్పుడే దోశలు రుచికరంగా వస్తాయి. ఇప్పుడు స్పప్ పై దోస పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ప్యాన్ పై నూనె వేసి దోశ పిండి వేసి గుండ్రంగా తిప్పుకోవాలి. రెండు వైపులా కలుపుకుని తీసేయాలి. మరింత రుచి కావాలంటే దోస పైన ఆనిమల్ లేదా కారం వేసుకోవచ్చు. అంతే రుచికరమైన టమాటో దోస రెడీ అయినట్లే, పల్లి లేదా కొబ్బరి చట్నీ తో బాగుంటుంది.