పొడవైన జుట్టును పొందాలనుకుంటున్నారా?.. అయితే ఈ యోగాసనాలు వేయండి.‌..!

జుట్టు బరువుగా పెరిగేందుకు ఈ యోగాసనాలు వెయ్యండి. రెండు చేతులు పైకి లేపి నమస్కారం చేస్తూ అలాగే కొద్ది దూరం పాటు నడవండి. దీనినే హీలింగ్ వాక్ అంటారు. దీనివల్ల తలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరగటంతో పాటు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. శీర్షాసనం వెయ్యటం ద్వారా తల ప్రాంతానికి రక్త ప్రసరణ మెరుగుగా జరుగుతుంది.

తద్వారా కుదుళ్లకు కావలసిన పోషకాలు అందుతాయి. దీనివల్ల జుట్టు బలంగా ఉంటుంది. ఈ ఆసనం వేయడం ద్వారా పెన్ను ముక, ఛాతి కండరాళ్లు బలోపేతం అవటంతో పాటు తల భాగానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా కుదుళ్లు బలముగా మారి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలభాగానికి రక్త ప్రసరణ మెరుగుపర్చడంలో పాదహస్తాసనం సహాయపడుతుంది.

తద్వారా కుదుళ్లకు మెరుగైన పోషణ అంది జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. సర్వాంగాసనం వేయడం ద్వారా తలకు, కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుగా జరుగుతుంది. తద్వారా కుదుళ్ళు ఆరోగ్యంగా ఉండి జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. భాతి, ఉదరం, వెన్నెముక కండరాలు బలో పేతం అవటంలో ఈ ఆసనం సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.