సలార్ 2 లో డైనోసార్ తో జతకట్టనున్న మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి బాక్స్ ఆఫీస్లు బద్దలు అవ్వడం పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలోనే మంచి పేరు గల వ్యక్తి. ఈయన ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులనే బాగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రభాస్ కొత్త మూవీ సలార్ 2 అనే విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరికెక్కిన ‘ సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు సలార్-2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ‘ సలార్-2’ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు.

ఆల్ రెడి ఇప్పటికే సలార్ 2 షూటింగ్ మొదలైంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. మరి, కియారా అద్వానీ, నిజంగానే ప్రభాస్ సరసన నటిస్తే..ఆ క్రేజ్ వేరు.

కాకపోతే..కియారా అద్వానీ పాత్ర సెకండ్ హాఫ్ లో మాత్రమే ఉంటుందని. అలాగే ఆమెపై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అన్నట్లు, ఈ పార్ట్ 2 సినిమాకు ‘ శౌార్యాంగ పర్వం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘ సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ కూడా మాట్లాడుతూ…ఏప్రిల్ లో ఈ సినిమా పార్ట్-2 స్టార్ట్ చేసి..2025 లో రిలీజ్ చేస్తామన్నారు. పార్ట్ 2 సినిమా ‘గేమ్ ఆఫ్ థ్రోనస్’ లా ఉంటుందని ఆయన తెలిపారు.