NBK 109 లో బాలయ్య లక్కి బ్యూటీ..అడిగి మరీ ఆమెనే పెట్టించుకున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ..ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా బాలయ్య ఈ మధ్యకాలంలో నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి సినిమాలు ఎలా సూపర్ డూపర్ హిట్ చేసాయో మనం చూస్తున్నాం.

ప్రెసెంట్ ఎన్నికల సందర్భంగా ఈ సినిమా షూట్ కి దూరంగా ఉన్నాడు బాలయ్య. వన్స్ ఎన్నికలు కంప్లీట్ అయ్యాక తన రిమైనింగ్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేయబోతున్నారు . అయితే ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ కీలకపాత్రలో హీరోయిన్ హనీ రోజ్ ని చూస్ చేసుకున్నాడట బాలయ్య. హనీ రోజ్ – బాలయ్య కాంబోలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి . ఈ సినిమాలో హనీ రోజ్ పెర్ఫార్మెన్స్ కెవ్వు కేక అని చెప్పాలి .

ముఖ్యంగా మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయా..? అనే సాంగ్ లో కుమ్మి పడేసారు . హనీ రోజ్ – బాలయ్య మరోసారి అలాంటి పర్ఫామెన్స్ ఈ సినిమాలో ఇవ్వబోతున్నారట.ఆశ్చర్యం ఏంటంటే బాలయ్యే అడిగే మరీ ఏరి కోరి ఈ సినిమాలో ఆమెను ఈ పాత్ర కోసం చూస్ చేసుకున్నాడట. దీంతో నందమూరి అభిమానులు కూడా షాక్ అయిపోతున్నారు. చూద్దాం మరి బాలయ్య ఇష్టపడి పెట్టుకున్న ఈ హీరోయిన్ బాలయ్య నమ్మకాన్ని ఏమాత్రం నిలబెట్టుకుంటుందో..? ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!