రంగస్థలం కాదు అంతకుమించి RC17 లో మరో స్టార్ హీరో ..సుకుమార్ ప్లానింగ్ వేరే లెవెల్..!

ప్రజెంట్ ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఒకే సినిమాపై పడ్డాయి . ఆ సినిమా మరేదో కాదు చరణ్ -సుకుమార్ సినిమా. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమా తర్వాత మళ్లీ వీళ్ళ కాంబో సెట్ అవ్వడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కి తండ్రి పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడట . ఇది పూర్తి సర్ప్రైజ్ గా సుకుమార్ రివిల్ చేయబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమా కోసం రాంచరణ్ చిరంజీవి ఇద్దరు కూడా అగ్రిమెంట్ పేపర్ల పై సైన్ కూడా చేసేసారట . ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా దాచి పెట్టాడట సుకుమార్ . అంతేకాదు ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ కు వాళ్ళ రియల్ లైఫ్ లో ఉన్న కనెక్షన్ కూడా చూపించబోతున్నారట .

దీంతో సుకుమార్ ప్లానింగ్ వేరే లెవెల్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు సుకుమార్ అభిమానులు . ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్న నువ్వు కెవ్వు కేక స్వామి అంటూ ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . మరి సుకుమార్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో..?. మనకు తెలిసిందే పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ సుకుమార్ చరణ్ సినిమాను సెత్స్ పైకి తీసుకురాబోతున్నాడట..!