అప్పుడు బేబీ..ఇప్పుడు బ్యూ** ..ఇదేం టైటిల్స్ రా మావ.. మెంటెల్ ఎక్కిస్తున్నారుగా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కధ.. కంటెంట్ పై కాకుండా టైటిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కొందరు డైరెక్టర్లు .. మేకర్లు . అందుకే టైటిల్స్ పెట్టడానికి ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. గత ఏడాది ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్న బేబీ మూవీ గురించి మనందరికీ తెలిసిందే . యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా తెరంగేట్రం చేసిన మూవీ ఇదే.

విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . పెట్టిన దానికి ఒకటి రెండు కాదు ఏకంగా పది రెట్లు లాభాలు తీసుకొచ్చింది . ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనాన్ని క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాతలలో డైరెక్టర్ మారుతి కూడా ఒకడు ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మరో సినిమా వస్తుంది.

దానికి డిఫరెంట్ టైటిల్ పెట్టారు . అది కూడా కుర్రాళ్ళకి నచ్చే టైటిల్ పెట్టడం గమనార్హం . సుబ్రహ్మణ్యం ఆర్.వి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జి స్టూడియోస్తో కలిసి మారుతి టీం ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఏ విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈనెల 22వ తేదీ ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారట. అప్పుడే సినిమాకి సంబంధించిన లుక్ టైటిల్ కూడా రివీల్ చేస్తారట . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాకి బ్యూటీ అనే టైటిల్ ని పెట్టుకొచ్చారట . ఒకప్పుడు బేబీ ఇప్పుడు బ్యూటీ ఈ కల్ట్ టైటిల్స్ ఏంట్రా బాబు ..యువతను ఆకట్టుకోవడానికేనా ..రాను రాను ఇలా దిగజారిపోతున్నారు ఏంటి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు కొందరు జనాలు..!!