బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: బన్నీతో ఆ స్టార్ హీరో మల్టీస్టారర్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే…?

ఇది నిజంగా అభిమానులకి పిచ్చెక్కించే బ్లాస్టింగ్ అప్డేట్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల సినిమాల ట్రెండ్ ఎక్కువగా ముందుకు వెళ్తుంది . ఈ విషయం మనకు బాగా తెలుసు. బడాబడా డైరెక్టర్ లు పెద్దపెద్ద హీరోలు కూడా మల్టీ స్టార్లర్ సినిమాలలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోలు కూడా అలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం .

రీసెంట్గా బన్నీ ఓ బిగ్ మల్టీస్టారర్ మూవీతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే స్టైల్లో రాబోతున్నాడు అని ప్రచారం జరుగుతుంది . పుష్ప సినిమా అయిపోగానే ఈ సినిమానే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా లో బన్నీతో పాటు ప్రభాస్ కూడా నటించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరొక హాట్ న్యూస్ వైరల్ గా మారింది . కేవలం ప్రభాస్ బన్నీనే కాదు ఈ సినిమాలో మల్టీ టాలెంటెడ్ హీరో సూర్య కూడా నటించబోతున్నాడట. సూర్య ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడట . ఈ సినిమాలో సూర్య పాత్ర అద్భుతంగా ఉంటుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా బన్నీ – ప్రభాస్ మధ్య వచ్చే డైలాగ్స్ కు ఫ్యాన్స్ గొంతు చించుకొని అరిచిన కూడా ఆ కిక్కు రాదు అని.. మాస్ మాసివ్ స్టోరీ తో రాబోతున్నాడు అని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ గా మారాయి . ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. సాధారణంగా ఇద్దరు హీరోలను తెరపై చూస్తేనే ఆపుకోలేము మరి ముగ్గురు కత్తిలాంటి హీరోలను టాలెంటెడ్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూస్తే ఇక మాటలా..? సిల్వర్ స్క్రీన్ బద్దలై పోవాల్సిందే..!!