ఆ బడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్న కీర్తి సురేష్..ఫ్యాన్స్ కి ఊహించిన షాక్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ మహానటిగా పాపులారిటి సంపాదించుకున్న కీర్తి సురేష్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పకుందా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ప్రెసెంట్ టాలీవుడ్ -కోలీవుడ్ -బాలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకు వెళుతుంది . మరి ముఖ్యంగా తెలుగులో భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అమ్మడి కెరియర్ మొత్తం కొలప్స్ అయిపోతుందని ఎంత అనుకున్నారు .

కానీ కీర్తి సురేష్ ఎవరు ఊహించిన విధంగా బాలీవుడ్ సినిమాలకు ఓకే చేసింది. అక్కడ బోల్డ్ పాత్రలో కనిపించడానికి కూడా సిద్ధంగా ఉంది అంటూ ప్రచారం జరిగింది. తాజాగా టాలీవుడ్ లో ఆమె నాగచైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది అంటూ ప్రచారం జరిగింది. అయితే సడన్గా ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్టు నుంచి కీర్తి సురేష్ తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఆమెకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకుందా..? లేక హీరోయిన్ సాయి పల్లవి కావడంతో తన క్యారెక్టర్ కి పెద్దగా డిమాండ్ ఉండదు అని ఆలోచించే సినిమా నుంచి బయటకు వచ్చేసిందా..? తెలియాల్సి ఉంది. మొత్తానికి కీర్తి సురేష్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగియేలా చేస్తుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో..? ఆమెకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో..?