అమ్మ బాబోయ్.. తారక్ పెట్టుకున్న ఈ వాచ్ అంత కాస్ట్లీ నా..? ఎవరు గిఫ్ట్ చేశారో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తాజాగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో తెరకెక్కిన డిజెటిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది . ఈ సినిమా కోసం అనుపమ – సిద్దు ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిందే. ఫైనల్లీ ఈ సినిమా బిగ్ విజయం అందుకుంది .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సక్సెస్ ఈవెంట్ను గ్రాండ్గా జరిపారు మేకర్స్.ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు తారక్. స్టేజ్ పైకి వచ్చిన తారక్ ఎలా స్పీచ్ ఇచ్చారో మనం చూసాం . దానికి సంబంధించిన వార్తలు కూడా వైరల్ అయ్యాయి . అంతేకాదు ఈ ఈవెంట్లో తారక్ పెట్టుకున్న వాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఈవెంట్ లో తారక్ పెట్టుకున్న వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడంతో అందరి కళ్ళు తారక్ వాచ్ పైనే పడ్డాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బాగా ఈ వాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . అది ‘Audemars Piguet Royal Oak Offshore’ మోడల్ వాచ్ అని, దాని ధర అక్షరాలా రూ.16,232,657 కనిపెట్టేసారు. ఈ విషయాన్ని ప్రస్తుతం నెట్టింట వైరల్ చేస్తూ వస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వాచ్ ను ఆయన భార్య లక్ష్మీ ప్రణతి తారకకు గిఫ్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది