రష్మిక బర్త్ డేకే వస్తున్న ఫ్యామిలీ స్టార్.. రౌడీ హీరో ఏం చెప్పాడంట..?!

ప్రస్తుతం రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరుశురాం డైరెక్షన్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. కుటుంబ వినోదాత్మ‌క సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే సినిమా రిలీజ్ ఉండడంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా జరిగాయి.

ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్‌తో కిట్టి పార్టీ అంటూ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటిమణులు విజయ్ దేవరకొండ తో చిట్‌ చాట్ జరిపారు. నేపథ్యంలో సినిమా రిలీజ్ విషయంలో విజయ్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఈ మ‌మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఆ తేదీన మరో విశేషం ఏదైనా ఉందా అని విజ‌య్‌ను కొంద‌రు అడిగారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం సెలవులు ఎక్కువగా ఉండటం అంటూ విజయ్‌ వివరించాడు. దీంతో అక్కడున్న వారు నవ్వడం స్టార్ట్ చేశారు.. ఏప్రిల్ 5న అదే కాదు ఇంకో స్పెషల్ కూడా ఉంది.. అదే రష్మిక మందన పుట్టినరోజు అనుకుంటా అని వేరొకరు అన్నారు.

దీనికి విజయ్‌ మాట్లాడుతూ.. అవును ఆ రోజు రష్మిక పుట్టినరోజు. అది మాకు లక్కీ అవుతుందని అనుకుంటున్నా అంటూ వివరించాడు. వాస్తవంగా ఏప్రిల్ 5,6,7 తేదీలు వ‌రుస‌గా వీకెండ్‌లు. ఆ తర్వాత వెంటనే ఉగాది, రంజాన్ ఒకే వారంలో ఉన్నాయి. దీంతో ఫ్యామిలీ స్టార్‌ కలెక్షన్లు బాగా వస్తాయని.. ఆ కారణంగానే సినిమాను తెర్కెక్కిస్తున్నామంటూ విజయ్ వివరించాడు. ఇక గత కొంతకాలంగా విజయ్‌, రష్మికల మధ్య ల‌వ్ ట్రాక్‌ నడుస్తుందంటూ రూమ‌ర్స్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5నే రష్మిక పుట్టినరోజు.. అదే రోజున ఫ్యామిలీ స్టార్‌ కూడా రిలీజ్ కావడంతో ఇప్పుడు వీరి లవ్ ఎఫైర్ వార్తలకు మరింత బలం పుంజుకుంది.