హిట్లు పడకపోయినా స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ కొట్టేసిన స్టార్ డైరెక్టర్లు వీళ్ళే..

సినీ ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో జాన‌ర్‌లో తమ స్టైల్‌లో సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకుంటుంటారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం హిట్ సినిమాలు తీస్తూ.. ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధిస్తూ.. స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుని వారి క్రేజ్ మరింతగా పెంచుకుంటారు. అయితే స్టార్ హీరోలు కూడా చాలామంది సక్సెస్ సాధించిన డైరెక్టర్లకే అవకాశాలు ఇస్తారు. కానీ కొంతమంది మీడియం రేంజ్ డైరెక్టర్లు.. చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా స్టార్ హీరోలతో సినిమా అవకాశాలను అందుకుంటూ క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఏమైంది ఈవేళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంపత్ నంది ఒక‌రు.

మొదటి సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్నా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమా తెరకెక్కించే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా యావరేజ్ గా ఆడింది. ఇక పక్క కమర్షియల్ లాంటి భారీ ఫ్లాప్ సినిమాను తెరకెక్కించిన‌ మారుతికి కూడా ఇటీవల ప్రభాస్ రాజాసాబ్‌ సినిమా తెర‌కెక్కించే ఛాన్స్ అందించాడు. మారుతి కూడా ఇప్పటివరకు మరో స్టార్ హీరో తో సినిమా తీసిందే లేదు. అయినా ప్రభాస్ భారీ అవకాశాన్ని అందించి అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించాడు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ అయితే మారుతి రేంజ్ వేరే లెవల్ కు వెళ్తుంద‌న‌టంలో సందేహం లేదు. అయితే గతంలో మారుతి 23 సినిమాలను నటించినా.. అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆయనకు కూడా అవకాశాలు రాలేదు. ఇలాంటి టైంలో ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ అవకాశాన్ని ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఇద్దరు డైరెక్టర్లు భారీ సక్సెస్‌లు అందుకోకపోయినా స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే అవకాశాలను అందుకోవడం విశేషం.