చిన్నప్పటి నుంచి బన్నీ ఏం చెప్పినా ఇట్టే నమ్మేసే ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?!

ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు అల్లు అర్జున్. తాను చేసిన ప్రతి సినిమాతోనూ వైవిధ్యమైన పాత్రను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నాడు. అలాగే ఓ పాత్ర కోసం ఆయన ఎంతలా కష్టపడతాడంటే.. ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తారు. ఇక సుకుమార్ డైరెక్షన్లో రిలీజ్ అయిన పుష్పాలో తన మేనరిజంతో ప్రేక్షకులు కనెక్ట్ అయిన బన్నీ.. నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Allu Arjun Smashes Allu Sirish Rift Rumours With a Special Note, Calls Him  'Sweetest Forever' - News18

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు సంబంధించిన న్యూస్ నెటింట వైరల్ గా మారింది. ఆయన చిన్నప్పటి నుంచి ఏం చెప్పినా ఇట్టే నమ్మేసే ఓ వ్యక్తి ఉన్నాడు అంటూ.. అతను మరెవరో కాదు వాళ్ళ తమ్ముడు శిరీష్ అంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ ఏం చెప్పినా అది నిజమే అని వెంటనే నమ్మేస్తాడట శిరీష్. ఓ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వివరించాడు. ఈ భూమి మీద ముగ్గురే ముగ్గురు కుంఫు మాస్టర్లు ఉన్నారని అల్లు అర్జున్ తనకి చెప్పాడట.

Allu Sirish teams up with Suriya and Mohan Lal

వాళ్ళు ఎవరంటే మొదటిది జాకీచాన్, మరొకరు వేరే పేరు ఏదో చెప్పారని.. ఇక మూడో వ్యక్తిగా తన పేరు చెప్పుకున్నాడని.. దాంతో కొద్ది సంవత్సరాలు పాటు నేను అదే నిజమని భావించానని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు. అలా అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి ఏది చెప్పినా టక్కుమని శిరీష్ నమ్మేస్తాడట. ఈ విషయాన్ని బ‌న్ని కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి చెబుతూ ఉంటాడు. దీనిబట్టి వీరిద్దరి మధ్యన ఎలాంటి బాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.