DSP తొక్కేసిన ఆ పాపమే.. తమన్ పాలిట ఈ విధంగా శాపంగా మారిందా..? పాపం ఎంత కష్టం వచ్చిందో..!

ఇండస్ట్రీలో ఒక స్టార్ ఎదుగుతున్నాడు అంటే .. మరొక స్టార్ తొక్కేయడం సర్వసాధారణం . తొక్కేయడం అంటే వాళ్ళ ఆఫర్స్ వీళ్ళు తీసుకోవడమో ..? లేకపోతే వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ల కెరియర్ ని నాశనం చేయడమో కాదు..? టాలెంట్ పరంగా తొక్కేయడం . అది మనం చాలా చాలా సినిమాలలో చూసాం . రీసెంట్ గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త సంచలనంగా మారింది . సినిమా ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

దేవిశ్రీప్రసాద్ మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కితే మంచంలో ఉన్న ముసలివాడు సైతం ఊగిపోవాల్సిందే . అలాంటి మాస్ సాంగ్స్ తో అదరకొట్టేస్తాడు. పలువురు హీరోలు మా సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వాలి అంటూ కాచుకొని కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి . అదే దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉందో కూడా మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అందరికీ ముందుగా వినిపించే పేరు డి.ఎస్.పి ..అదే ఇప్పుడు పరిస్థితికి వచ్చేసరికి తమన్ అంటూ చెప్పుకొస్తున్నారు.

డిఎస్పీ కెరియర్ సగం నాశనం అవ్వడానికి కారణం తమన్ అంటూ పలువురు ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆఫర్స్ అన్ని తమన్ కొట్టేశాడు అని .. తమన్ క్లాసిక్ మ్యూజిక్ ఇవ్వడంలో తోపైనా మ్యూజిక్ డైరెక్టర్ అని కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఇప్పుడు తమన్ పరిస్థితి కూడా ఇంచుమించు దేవిశ్రీ ఇలా తయారయింది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ మధ్యకాలంలో తమన్ కొత్తగా కమిట్ అయిన సినిమాలు ఏమీ లేవు .

అంతేకాదు పలువురు బడా డైరెక్టర్ లు అందరూ కూడా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . త్వరలోనే రిలీజ్ కాబోతున్న దేవర సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు . అంతేకాదు మరికొన్ని అప్ కమింగ్ బడా ప్రాజెక్ట్స్ కి కూడా కమిట్ అయినట్లు సమాచారం అందుతుంది. దీంతో దేవిశ్రీప్రసాద్ ఫ్యాన్స్ తమన్ ఆడేసుకుంటున్నారు . డిఎస్పీ ఆఫర్స్ ను లాగేసుకున్న ఆ పాపమే నీకు ఇప్పుడు ఈ విధంగా శాపంగా మారింది అంటున్నారు. అంతేకాదు చాలా సినిమాల విషయాలలో ట్రోలింగ్కి గురయ్యారు . ఆయన సొంత ట్యూన్స్ ను ఆయనే కాపీ కొట్టుకుంటాడు అన్న పేరు కూడా ఆయనకు ఉంది..!!