వాట్.. రాజమౌళి కూడా అలాంటి సెంటిమెంట్లు ఫాలో అవుతాడా? అవేంటంటే..?!

తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా తనకంటూ భారీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈయన.. చివరిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబుతో మరో సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనకు మించిన డైరెక్టర్ ఎవరు లేరు అనే విధంగా క్రేజ్‌ సంపాదించుకున్న జక్కన్న.. మహేష్ బాబుతో తెర‌కెక్కిస్తున్న పాన్ వర‌ల్డ్‌ సినిమాతో మరిన్ని రికార్డులను బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్లు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు.

అలాగే రాజమౌళి కూడా కొన్ని సెంటిమెంట్లను గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటాడని భారీ ఎత్తున వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఈ న్యూస్‌ మరింత వైరల్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు రాజమౌళి ఎలాంటి సెంటిమెంట్లను నమ్మరు అని.. కేవలం క్యారెక్ట‌ర్ దృష్ట్యా ఫ్లాప్ లో ఉన్న సరే ఆ హీరో సెట్ అవుతాడ‌నిపిస్తే కచ్చితంగా తీసుకుంటాడు అంటూ ప్రేక్షకులంతా నమ్మారు. అయితే రాజమౌళి కూడా సెంటిమెంట్ల‌ను నమ్ముతాడని తెలియడంతో నెటిజ‌న్స్ ఆయ‌న‌ను ట్రోల్స్ చేస్తున్నారు.

దానికి కారణం బాహుబలి, త్రిబుల్‌ ఆర్‌. ఈ రెండు సినిమాలు మొదట అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి షూటింగ్ మొదలుపెట్టడమే.. రాజమౌళి అక్కడి నుంచి సినిమాను స్టార్ట్ చేయడం సెంటిమెంట్ గా ఫీల్ అవుతారని.. ఆ మూవీలు రెండు సూపర్ డూపర్ సక్సెస్ సాధించడానికి అదే కారణం అని నమ్ముతారని తెలుస్తుంది. కనుక ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోయే సినిమాను కూడా అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి మొదలు పెట్టానున్నాడట. దీనికి సంబంధించిన సెట్ వర్క్స్ పనిలో మేకర్స్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి కూడా ఇలాంటి సిల్లీ సెంటిమెంట్స్ ఫాలో అవుతాడు అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.