150 థియేటర్లలో 50 రోజులు ఫినిష్ చేసుకున్న ” హనుమాన్ “… బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోశాడుగా..!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన హనుమాన్ మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ మహేష్ బాబు గుంటూరు కారాన్నే ఢీ కొట్టింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోవడం అంటే ఏంటో నిరూపించారు ప్రశాంత్ వర్మ మరియు తేజ. గతంలో ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా మరో రికార్డును నెలకొల్పింది.

హనుమాన్ మూవీ 150 థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మూవీ త్వరలోనే ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వినయ్ రాయ్, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి మంచి టాక్ దక్కింది. ఒక చిన్న సినిమాగా విడుదలై ఇంత పెద్ద విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు.ఈ మూవీలో యాట్‌ చేసిన ప్రతి యాక్టర్స్ కి కూడా పాపులారిటీ దక్కింది.