రష్మిక పాలిట శాపంగా మారిన ఆ ఇద్దరు హీరోయిన్లు.. బాగానే ఇరికించేస్తున్నారుగా..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా..ఎలా దూసుకుపోతుందో మనకు తెలిసిందే. ఛలో సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక ఆ తర్వాత మహేష్ బాబు బన్నీల సినిమాలలో అవకాశాలు దక్కించుకొని పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది . పుష్ప సినిమా ఆమె కెరియర్ను మలుపు తిప్పింది అని చెప్పడంలో సందేహం లేదు.

రీసెంట్గా ఆమె నటించిన యానిమల్ సినిమాలో కూడా బోల్డ్ నెస్ ను ప్రదర్శించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అయితే పాన్ ఇండియా సినిమాలు అంటే మొదటగా అందరికీ హీరోయిన్ రష్మిక నే గుర్తు వచ్చేది కానీ ఇప్పుడు డైరెక్టర్ ఆమెను పక్కన పెట్టేస్తున్నారు. రష్మిక బోల్డ్ పర్ఫామెన్స్ చూశాక ఆ రేంజ్ మేము తట్టుకోలేము అంటూ వేరే హీరోయిన్స్ కి కమిట్ అవుతున్నారు . ప్రెసెంట్ ఇప్పుడు మృణాల్ ఠాకూర్..

జాన్వి కపూర్ ల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి . పలు పాన్ ఇండియా సినిమాలలో రష్మిక కి బదులుగా .. ఈ ఇద్దరు హీరోయిన్స్ చేసుకుంటున్నారు మేకర్స్ . రష్మిక నటించాల్సిన రెండు సినిమాలను జాన్వి కపూర్ ఎగరేసుకుపోయింది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో రష్మిక పాలిట శాపంగా మారారు జాన్వీ- మృణాల్ ఠాకూర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం.. ఈ ఇద్దరు హీరోయిన్స్ ని రష్మిక మందన ఎలా బీడ్ చేస్తుందో..?