సముద్రంలో దొరికిన భారీ శివలింగం.. చూసేందుకు ఏగ‌బడుతున్న జనం..

గుజరాత్ భరోజ్ సముద్ర తీర సమీపంలో శివలింగాన్ని గుర్తించారు మత్స్యకారులు. ఈ శివలింగం దాదాపు 100 కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు వివరిస్తున్నారు. మత్స్య‌కారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళగా.. ఆ టైంలో శివలింగం వారి వలకు చిక్కుకుందని.. ఏదో భారీ చేప వలలో చిక్కిందని మేమంతా భావించామంటూ వివరించారు. వలను పైకి లాగిన తర్వాత వారికి అది శివలింగం ఆకారంలో ఉన్న ఒక రాయి అని అర్థమైంది. దినీ అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకువచ్చారు ఆ మత్స్యకారులు. ఈ విషయం ఊళ్లో వాళ్ళందరికీ తెలియడంతో.. సముద్రంలో దొరికిన శివలింగాన్ని చూసేందుకు జనం అంతా ఎగబడ్డారు.

తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తరలివచ్చారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు కూడా చేరారు. గుజరాత్.. జంబు సార్ తహసిల్ లోని.. కవి గ్రామానికి చెందిన పదిమంది మత్స్య‌కారులు సముద్రంలో చేపలు పట్టడానికి దిగగా ఈ సంఘటన జరిగింది. శివలింగం ఎక్కడి నుంచి వచ్చిందా అని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం.. అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకొని దానిని పరిశీలిస్తున్నారు. ఇటీవల సముద్రంలో సంభవించిన ఆటుపోట్ల కారణంగా ఆ శివలింగం నీటి ఉపరితలం పైకి వచ్చి ఉండవచ్చని తెలుస్తుంది.

దీంతో మత్స్యకారుల వల‌లో సులభంగా చిక్కుకుపోయి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. అయితే శివలింగంపై నాగపాము గుర్తులు కూడా ఉన్నాయని స్థ‌నికులు చెప్తున్నారు స్థానిక మత సంస్థలో ఆ కవి గ్రామ సమీపంలో శివలింగాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. శివలింగం ఏ రాతిలో నిర్మితమైందో.. పరిశోధనలో తెలనుంది. దీని తయారుచేసిన రాయి సమీపంలోని ఏ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని కూడా వీరు పరిశీలిస్తున్నారు.