మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న 12th ఫెయిల్ మూవీ.. వరల్డ్ వైడ్ గా ఎన్నో స్థానం అంటే…!

సాధారణంగా మన టాలీవుడ్ లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు చిన్న సినిమాలు గా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటాయి.

అలాంటి వాటిలో 12th ఫెయిల్ మూవీ కూడా ఒకటి. దీనిని బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ తెరకెక్కించుగా శ్రీకాంత్ కీలక పాత్రలో వహించాడు. ఈ మూవీ గత ఏడాది అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక డిసెంబర్ 29 నుంచి ఓటీటీ సంస్థ డిజినీ + హాట్ స్టార్ లో ప్రసారమైంది.

అదేవిధంగా ఇటీవలే 69 ఫిలిం ఫేర్ లో ఉత్తమ సినిమాగా అవార్డు గెలుచుకుంది. అంతేకాకుండా ఓ అరుదైన రికార్డ్ని సైతం సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 250 ఉత్తమ చిత్రాల జాబితాలలో ఏకంగా టాప్ 50 లో ఉండటం విశేషం. ఏకైక హిందీ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక దీనిని ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.