క్లీం కారా ను ముద్దుగా మెగా ఫ్యామిలీ ఏమని పిలుస్తుందో తెలుసా..? భలే ఫన్నీగా ఉందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ .. దాదాపు పెళ్లయిన పదకండేళ్ల తర్వాత మొదటి బిడ్డకు తండ్రి అయ్యాడు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్ళై పదేళ్లయినా సరే పిల్లలు కలగకపోవడంతో సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించి హ్యుజ్ ట్రోలింగ్ చేశారు . ఫైనల్లీ ఈ జంట పెళ్లయిన పదకండేళ్లకి తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలికారు .

క్లీం కార జన్మించిన తర్వాత మెగా ఫ్యామిలీ లో కొత్త కళ వచ్చింది. ఈ విషయాన్ని స్వయాన మెగాస్టార్ చిరంజీవిని చెప్పుకొచ్చారు. వరుణ్ పెళ్లి ..అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం.. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం అంతా కూడా క్లీం కారా పుట్టిన వేళా విశేషమే అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు . కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన క్లింకార గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకు వచ్చింది .

తండ్రి దగ్గరకు వస్తే కళ్ళు బ్లింక్ చేస్తుంది అని చరణ్ అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన ఉపాసన.. ఫ్లోలో క్లింకారను కారా అంటూ పిలుస్తాము అని చెప్పకనే చెప్పేసింది . దీంతో క్లింకార ముద్దు పేరు కారా అన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మెగా అభిమానులు ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రసెంట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు..!!