హవ్వ..టంగ్ స్లిప్ అయిన శ్రీలీల..మహేశ్ బాబును అంత మాట అనేసింది ఏంటి..?

పాపం తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ .. శ్రీ లీల అడ్డంగా బుక్కైపోయింది . సోషల్ మీడియాలో శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శ్రీలీలను బాగా ట్రోల్ చేశారు . పాపం గుంటూరు కారం సినిమాలో నటించినందుకు ఆమెను దారుణాతి దారుణంగా మాట్లాడారు. కేవలం డ్యాన్స్ కి తప్పిస్తే నువ్వు దేనికి పనికిరావు అంటూ నానావిధాలుగా ఆమెను హర్ట్ చేశారు . ఈ సినిమాలో నటించడం ద్వారా ఆమెకు ఒదిగింది ఏమీ లేదు అంటూ చాలామంది కామెంట్స్ చేశారు .

అయితే పొరపాటున శ్రీ లీల ఫ్రెండ్స్ వద్ద అదే విషయాన్ని బయట పెట్టేసిందట . “గుంటూరు కారం సినిమా హిట్ అయిందిగా ..పార్టీ ఎప్పుడూ అంటూ ఫ్రెండ్స్ అడగ్గా.. నా బొంద ఆ సినిమా హిట్ అయిందని నేను మీకు పార్టీ ఇవ్వాలా ..?”అంటూ పరోక్షంగా టంగ్ స్లిప్ అవుతూ మహేష్ బాబుని డి గ్రేడ్ చేసేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మహేష్ బాబు తో సినిమా ఆఫర్ ఊరికే రాదు . మహేష్ బాబుతో నటించాలి అని ఎప్పటినుంచో కోరుకుంటున్నట్లు స్వయానా శ్రీలీలానే చెప్పుకొచ్చింది. మరి అలాంటి శ్రీలీల ఫ్రెండ్స్ వద్ద ఇలా టంగ్ స్లిప్ అవ్వడం ఇప్పుడు అభిమానులకి హర్టింగా అనిపిస్తుంది .

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ శ్రీ లీల పలు సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది . అయితే కొత్తగా ఆమె ఖాతాలో ఏ సినిమా పడకపోవడం గమనార్హం. ఉన్న సినిమాలను మేనేజ్ చేసుకుంటూ వస్తుంది . ఒకవేళ నెక్స్ట్ ఆమె నటించిన సినిమా కూడా ఫ్లాప్ అయితే శ్రీ లీల కెరియర్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు..!!