‘ ఈగిల్ ‘కి కూడా సీక్వెల్ ఉందా.. గుస్ బంప్స్ తెప్పించే టైటిల్ లాక్ చేసిన మేకర్స్..

మాస్ మహారాజ రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన మూవీ ‘ ఈగిల్ ‘. యంగ్‌ డైరెక్టర్ కార్తిక్ ఘ‌ట్టమనేని ఈ సినిమాను భారీ యాక్షన్ ట్రీట్ తో తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే ట్రైలర్ తో భారీ హైప్‌ను క్రియేట్ చేసినా ఈ మూవీ ఈరోజు రిలీజై ఫాన్స్ దగ్గర పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ తర్వాత మరోసారి సోషల్ మీడియాలో సాలీడ్ అప్డేట్ వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్‌ బాగా నడుస్తుంది. ఇలా సీక్వెల్స్ జాబితాలో ఇప్పుడు ఈగిల్‌ కూడా చేరింది. ఈ మూవీకి కూడా సీక్వెల్ ఉందంటూ మేకర్స్ పార్ట్ 2ని ఫిక్స్ చేశారు. పార్ట్ 2 కి పవర్ ఫుల్ టైటిల్ ని కూడా లాక్ చేశారు.

ఈగిల్ సెకండ్ పార్ట్ కు ” ఈగిల్ – యుద్ధకాండగా ” టైటిల్ అనౌన్స్ చేశారు. ఇక ఈగ‌ల్ లో శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్, మధుబాల తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. డేవిడ్‌ సంగీతం అందించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.