ఒక్కే ఒక్క దెబ్బతో బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారి ఆంటీ.. రష్మికనే మించిపోయిందిగా..!!

కుమారి ఆంటీ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా గత రెండు నెలల నుంచి సోషల్ మీడియాలో కుమారి ఆంటీ కి సంబంధించిన రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంది కుమారి ఆంటీ . మొదట పెద్దగా జనాలకి ఎవరికీ తెలియదు .

ఆమె వండే ఫుడ్ టెస్ట్ బాగుండడంతో పైగా చీప్ రేట్ కి కడుపునిండా భోజనం పెడుతూ ఉండడంతో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది . తద్వారా పలు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఆమెపై ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు . రీసెంట్గా ఆమె వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది అంటూ పోలీసులు ఆమె హోటల్ ని క్లోజ్ కూడా చేయించారు . ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయానరంగంలోకి దిగి ఆమె ఫుడ్ బిజినెస్ను మళ్లీ ఓపెన్ చేయించారు.

కాగా రీసెంట్గా కుమారి ఆంటీ కి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది . కుమారి ఆంటీ పాపులారిటీ దక్కించుకోవడంతో పలు రియాలిటీ షోస్ ఆమెను ఇన్వైట్ చేస్తున్నారట. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా ఆఫర్ వచ్చిందట. కానీ కుమారి అంటే మాత్రం వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . కుమారి ఆంటీ తన సొంత కష్టంతోనే బ్రతకడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. చాలామంది కుమారి ఆంటీ ని బిగ్ బాస్ షో కి వెళ్లొద్దు అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!