నైజాంలో ” హనుమాన్ ” మూవీ 3 వారాల కలెక్షన్స్ ఇవే..!

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ గుంటూరు కారాన్నే తల దన్నింది.

ఇక లాంగ్ రన్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది హనుమాన్. ఇక మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలను అందించగా నైజాం మార్కెట్లో కూడా మాసివ్ నెంబర్ని సెట్ చేసింది. మరి ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా మూడు వారాల రన్ ని అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ నైజాం మార్కెట్లో మూడు వారాలు పూర్తి అయ్యేసరికి 30.65 కోట్ల షేర్ ని అందుకుంది.

ఈ మూవీ రాబట్టాల్సింది 36.65 కోట్లు. అలానే 62.68 కోట్ల గ్రాస్ ని ఈ మూడు వారాల్లో రాబర్ట్ నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రజెంట్ మూడు వారాలు 15,170 షోస్ పడగా 33 లక్షల 37 వేల 952 ఫుడ్ ఫాల్స్ ‌ యొక్క నైజాం మార్కెట్ నుంచి రావడం గమనార్హం. మొత్తానికి హనుమాన్ సూపర్ హిట్ విజయం సాధించిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకే ఈ రేంజ్ లో వసూళ్లు కలెక్ట్ అవడంతో దీన్ని సీక్వెల్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.