తారక్ ” దేవర ” మూవీ షూటింగ్ పై మరో అప్డేట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న తాజా మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీని మేకర్స్ భారీ హంగులతో తెరకెక్కిస్తున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ రీసెంట్ గానే వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర షూట్ కి సంబంధించిన ఓ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ కొత్త ఏడాది స్టార్టింగ్ లోనే మేకర్స్ ఫాన్స్ కి సాలిడ్ అప్డేట్స్ అందించారు.

కానీ షూటింగ్ లో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. ఇక ఈ మూవీ దాదాపు షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా రెండు వారాలు మేరా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ షూట్ ఇకపై మొదలు కానుంది. ఇక కొన్ని పాటలు సహా యాక్షన్ పార్ట్ ని ఈ కొన్ని రోజుల్లో షూట్ చేయనున్నారట. ఇక ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన అనంతరం అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.