మరోసారి సాలిడ్ రెస్పాన్స్ని దక్కించుకున్న ” బలగం “..!

టాలీవుడ్ నటుడు మరియు కమీడియన్ అయిన వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ” బలగం ” మూవీ ఎంతటి విజయాన్ని సాధించుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజై చాలా కాలం అవుతున్నప్పటికీ ప్రస్తుతం కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయింది.

ఈ సినిమా ఇటీవల మరోసారి ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారమైంది. ఇక ఈ మూవీ మంచి టిఆర్పి రేటింగ్ ను రాబట్టడం జరిగింది. 6.05 టిఆర్పి రేటింగ్ను నమోదు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ థియేటర్ పరంగానే భారీ వసూళ్లను క్రియేట్ చేసింది అనుకుంటే.. టీవీ లో కూడా భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది.

ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చూసాము. కానీ ఈ విధమైన సినిమాని ఎప్పుడూ చూడలేదు. ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చిన బలగం మూవీ మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో స్పెషల్ ప్లేస్ ని సంపాదించుకుంది. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.