అనిల్ రావిపూడి నెక్స్ట్ కమిట్ అయిన హీరో ఎవరో తెలిస్తే.. ఫ్యూజులు ఎగిరిపోతాయ్..మరో హిట్ కొట్టాడు పో..!!

అనిల్ రావిపూడి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నా కూడా.. సరే అనిల్ రావిపూడి అనే పేరు చెప్తే జనాలకి ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంది . సినిమాలను ఎవ్వరైనా తెరకెక్కిస్తారు . కానీ జనాలు నవ్వుకునే విధంగా జనాలకి పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ మాత్రం అనిల్ రావిపూడి అని చెప్పాలి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఫ్లాప్ అనేది లేదు .

అంతేకాదు అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాలు కుటుంబ సమేతంగా చూసి నవ్వుకునే విధంగా ఉంటాయి. ఎఫ్2 , ఎఫ్3 , రాజా ది గ్రేట్ , భగవంత్ కేసరి , సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించింది అనిల్ రావిపూడి నే.. రీసెంట్గా అనిల్ రావిపూడి వెంకటేష్ తో సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆల్రెడీ ఎఫ్2 , ఎఫ్3 సినిమాల్లో వెంకీ స్టైల్ ను చూపించేశాడు .

ఇప్పుడు మరో డిఫరెంట్ యాంగిల్ లో వెంకీ తో సాహసం చేయబోతున్నాడట అనిల్ రావిపూడి. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నారట. వీళ్ల కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్టే. మరో సారి డబుల్ హ్యాట్రీక్ కాంబో రిపీట్ కాబోతుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!