సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటి, మోడల్ పూనం పాండే మృతి..

తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మోడ‌ల్ , న‌టి పూనామ్ పాండే మృతి చెందారు. క్యాన్సర్ భారినపడి చికిత్స తీసుకుంటున్న ఈమె పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూన‌మ్‌ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా వివరించాడు. ఈ విషయం తెలిసిన వెంట‌నే ప‌లువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు.

ఇక పూనామ్ పాండేకు సినీ అభిమానుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండేది ఈ ముద్దుగుమ్మ. ఘాటు ఫోటోషూట్లు, హాట్‌ వీడియోలు ఫేర్ చేస్తు నిటిజ‌న్ల‌ను ఆక‌టుకుంటుంది. ఆమె ఎప్పుడు 18 ప్లస్ కంటెంట్ మాత్రమే ప్రమోట్ చేస్తూ కుర్రకాలలో హీట్ పెంచేస్తూ ఉండేది.

ఇండియా వరల్డ్ కప్ కొడితే బీచ్ లో నగ్నంగా తిరుగుతానంటూ పూన‌మ్‌ గతంలో బోల్డ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియా వేదికపై ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూనమ్‌ పాండే మృతి చెందడంతో అంతా సంతాపం తెలియజేస్తున్నారు.