నా కూతురు కార్తీకకు ప్రమోషన్ వచ్చిందంటూ.. ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న సీనియర్ నటి రాధ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో రాధ ఒకటి. 80,90 లలో హిట్ సినిమాలు నటించి మెప్పించిన ఈమె తర్వాత.. ఆమె కూతురు కార్తిక నాయ‌ర్‌ను జోష్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేసింది. 2009లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య హీరోగా కార్తిక హీరోయిన్గా నటించిన సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. కార్తీక బ్ర‌ద‌ర్ ఆఫ్‌ బొమ్మలో, ద‌మ్ము లాంటి సినిమాల‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో మెప్పించింది.

ఆ తర్వాత 2011లో డైరెక్టర్ కెవి ఆనంద్ డైరెక్షన్లో వచ్చిన గో మూవీతో తమిళ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ సంపాదించిన కార్తిక ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. దీంతో సినిమాలకు దూరమైన ఈమె వ్యాపార రంగంలో దిగి బిజీ అయిపోయింది. ఇక ఇటీవల ఆమె తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ మీన‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక వీరి వివాహమై రెండు నెలలైనా కాకముందే నా కూతురుకు ప్రమోషన్ వచ్చింది అంటూ రాధా ఓ హ్యాపీ న్యూస్ ను ఫోటోలతో సహా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

ఇంతకీ ఆ హ్యాపీ న్యూస్ ఏంటి ఒకసారి చూద్దాం. పెళ్లయిన రెండు నెలలకే తన కూతురికి ప్రమోషన్ వచ్చిందంటూ ఇన్స్టాల్ లో షేర్ చేసుకున్న రాధ‌.. నా కుమార్తెను కొత్తగా పెళ్లి అయిన మహిళగా చూడడం ఆనందంగానూ.. గర్వంగాను ఉంది. అయితే ఇప్పుడు కొత్త కోడలు.. పెద్ద కోడలుగా ప్రమోషన్ అందుకుంది. ఇప్పుడు ఆ ఇంటికి మరో కోడలు అడుగుపెట్టింది. వారికి నా అభినందనలు అంటూ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట‌ వైరల్ అవ్వడంతో అంత కార్తీకకు విషెస్ తెలియజేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Radha (@radhanair_r)