సైలెంట్ గా మంట పెట్టిన ధనుష్… ఎన్టీఆర్ డైరెక్టర్ ను లాగేసుకున్నాడుగా..!

ఈ మధ్యకాలంలో హీరోస్ ఒక ప్రాజెక్టుకు కమిట్ అయి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వకముందే మరొక ప్రాజెక్టును లైన్ లో పెడుతున్నారు . కేవలం స్టార్ హీరోసే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోస్ ఇదే విధంగా చేస్తున్నారు . రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ..ఎన్టీఆర్ మూవీ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . ధనుష్ ప్రెసెంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చూస్తున్నాడు .

అంతేకాదు ధనుష్ లిస్టులో బడా బడా డైరెక్టర్స్ ఉన్నారు. ధనుష్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అయితే ధనుష్ రీసెంట్గా తెలుగు బడా డైరెక్టర్ కు కమిట్ అయినట్లు తెలుస్తుంది . కొరటాల శివ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దేవర సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే ధనుష్ తో తెరకెక్కే సినిమా పనులను ప్రారంభించబోతున్నాడట కొరటాల శివ .

దీంతో ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్న మూవీ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో రష్మిక మరొకసారి డీ గ్లామరస్ లుక్ లో కనిపించబోతుందట. దీంతో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!