మహేశ్ ఫ్యాన్స్ కి సితార బిగ్ సర్ ప్రైజ్.. నాన్న కోసం ఏం చేసిందో చూడండి(Video)..!!

సితార ఘట్టమనేని .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మహేష్ బాబు కూతురుగా సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార ఘట్టమనేని అభిమానులకి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సితార ఘట్టమనేని పలు సాంగ్స్ కి డాన్స్ చేస్తూ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది .

రీసెంట్గా సితార ఘట్టమనేని తన తండ్రి నటించిన గుంటూరు కారం సినిమాను ఏఎంబి మాల్ లో మరోసారి చూసి ఎంజాయ్ చేసింది . తన ఫ్రెండ్స్ తో ఏ ఎం బి మాల్ లో మహేష్ బాబు కూతురు సితార గుంటూరు కారం సినిమాను చూసి ఎంజాయ్ చేసింది. ఈ సినిమా చూడడానికి సితార తన తండ్రి షర్ట్ వేసుకోరావడం గమనార్హం . మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ లో మహేష్ వేసుకున్న షర్ట్ ను సితార వేసుకొని ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేసింది .

దీంతో ఆ ఫొటోస్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు మహేష్ అభిమానులు. తండ్రి అవుట్ ఫిట్స్ తో సితార కనిపించడంతో.. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పోస్టులు చూసిన మహేష్ అభిమానులు.. ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది..!!