మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. చిరు ‘ విశ్వంభరా ‘ వచ్చేది అప్పుడే..

బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మూవీ విశ్వంభరా. భారీ యాక్షన్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ముల్లోకాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా కు ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా జనవరి 10, 2025న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. షూటింగ్ శ‌రవేగంగా జరుగుతుందని వివరించిన మేకర్స్.. ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా వివరించారు. ఇక దీంతో మెగా అభిమానులకు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

 

ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్, గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పంచభూతాలు, ముల్లోకలకలలు ఆధ్యాత్మిక అంశాలను జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. యువి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు చోట కే. నాయుడు సినిమా ఆటోగ్రాఫర్ గా, ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకుడుగా, ఎస్. ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.