మోర్ డేంజరస్ వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. సమంత మయోసైటీస్ నే మించిపోయే జబ్బు..!!

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ రకరకాల వింత వ్యాధులకు గురవుతున్నారు. అందం పట్ల ఆరోగ్యం పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తున్నా కానీ వింత వింత జబ్బులకు గురవుతూ ఉండడం గమనార్హం . ఇప్పటికే హీరోయిన్ సమంత హీరోయిన్ శృతిహాసన్ వాళ్ళు బాధపడుతున్న జబ్బుల గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ పూనం కౌర్ కూడా తాను బాధపడుతున్న జబ్బు గురించి బయట పెట్టింది .

ఆమె ఫైబ్రోమయాల్దియా అని అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది . ఇది మయోసైటీస్ లాంటిదే అంటూ కూడా చెప్పుకొచ్చింది . ఈ వ్యాధితో బాధపడేటప్పుడు బాడీ ఎక్కువగా బిగించుకుని పోతుంది అని.. కండరాలు పట్టేస్తాయని.. ఆ నొప్పి భరించలేము అని.. ఆ బాధ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటూ చెప్పుకు వచ్చింది. అంతేకాదు పూనం ఈ వ్యాధి కోసం న్యాచురోపతి మంతెన సత్యనారాయణ సలహాలు తీసుకొని ఈ వ్యాధి నుంచి కోల్పోవడానికి ట్రై చేస్తుందట .

ఈ వ్యాధి కారణంగా ఆమె ఎక్కువగా టైట్ బట్టలు కూడా వేసుకోలేకపోయిందట . లూజ్ గా ఉండే బట్టలనే కొన్ని సంవత్సరాలు ధరించి ఆ జబ్బు నుండి బయటపడడానికి కష్టపడిందట . ప్రజెంట్ పూనం కి ఉన్న జబ్బుకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ జబ్బు ఎందుకు వస్తుందో..? వరికి వస్తుందో..? ఎలా వస్తుందో..? కూడా సరిగ్గా చెప్పలేం అంటున్నారు డాక్టర్లు..!!