మరోసారి తల్లి కాబోతున్న గీతామాధురి.. గ్రాండ్గా సీమంతం సెలబ్రేషన్స్ జరుపుకున్న స్టార్ సింగర్.. పిక్స్ వైరల్

టాలీవుడ్ స్టార్ సింగర్ బిగ్‌బాస్ మాజి కంటిస్టెంట్ గీత మాధురి, నటుడు నందు.. ఈ జంటకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2019లో దాక్షాయిని అనే ఓ పాపకు జన్మనిచ్చారు. ఇక ఈ మధ్యన ఈ జంట విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని చెక్ పెడుతూ ఇటీవ‌ల‌ మరోసారి గీతామాధురి తల్లి కాబోతుంది అంటూ అనౌన్స్ చేసింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఈ ముద్దుగుమ్మ మదర్ హుడ్ లోని ఫీల్ ఎంజాయ్ చేస్తుంది.

Geetha Madhuri: మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌.. గుడ్ న్యూస్‌ చెప్పిన  గీతా మాధురి దంపతులు - Telugu News | Singer Geetha Madhuri and Actor Nandu  announce they are going to be parents ...

గీత దంపతులకు ఇదివరకే దాక్షాయిని అన్న పాప ఉంది. తాను రెండోసారి గర్భం ధరించినట్లు డిసెంబర్లో చెప్పుకొచ్చిన గీత.. ఫిబ్రవరిలో దాక్షాయినికి తోడుగా మరో బుజ్జి పాప రానుంది అంటూ వివరించింది. ఈ నెలలో గీత పండంటి బిడ్డను ప్రశ్నించనుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న గీత మాధురి.. తాజాగా సీమంత వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఈ ఫంక్షన్ లో గీత స్నేహితులు, సన్నిహితులతో పాటు భర్తనందు కూడా సందడి చేశాడు.

Singer Geetha Madhuri emotional in Seemantham Function | Geetha Madhuri  Seemantham function - YouTube

 

ఈ ఈవెంట్లో ఆకుపచ్చ నారింజరంగు కాంబినేషన్లో ఉన్న చీరలో మెరిసింది గీత. ఇక వేదిక కూడా రకరకాల పూలతో అందంగా డెకరేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఎంతమంది సెలబ్రిటీస్, అలాగే ఫ్యాన్స్, నెటిజెన్లు గీతామాధురికి మళ్ళీ పండంటి బిడ్డ పుట్టాలని.. ఇద్ద‌రు ఆరోగ్యంగా ఉండాలని తమ విషెస్ తెలియజేస్తున్నారు.