ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో కూడా భాగమై మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా గెస్ట్ రోల్ ఉన్నా కూడా ఆ పాత్రలో నటించడానికి స్టార్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఒక హీరో సినిమాలో మరి కొంతమంది హీరోలు నటించడం ప్రస్తుతం సాధారణ అయిపోయింది. అయితే ఇలా గెస్ట్ రోల్‌లో చేసినందుకు కూడా స్టార్ హీరోలు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ లో చేయబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వైరల్ అయ్యాయి. క్రికెట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రమ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. నిరోషా, తంగ దొరై మరియు ధన్య తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా లాంచ్ కార్యక్రమం ముగిసింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో క్యామియో రోల్ లో అరగంట కనిపించిన రజిని కేవలం ఆ చిన్న పాత్ర కోసం ఏకంగా రూ.40 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడని టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో రజినీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల ఫ్యుజులు ఎగిరిపోయినట్లు అయింది. ఇక ఈ సినిమాలో రజిని నటిస్తూ ఉండడంతో సినిమాకు భారీ మార్కెట్ జరిగిందని.. అందుకే నిర్మాతలు కూడా ఆయనకు ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.