“పైట విప్పాలి అన్నాడు”.. మోహన్ బాబు నిజ స్వరూపాని బయటపెట్టిన నటి జయలక్ష్మి..!!

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఎలా మారిపోతూ ఉంటాయో ఎవరు గెస్ చేస్తూ ఉండలేరు . అది హీరో కావచ్చు .. హీరోయిన్ కావచ్చు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు .. కొన్నిసార్లు వాళ్లకి ఇష్టం లేని సీన్స్ లో నటించాల్సి ఉంటుంది . అయితే చాలామంది అలాంటి సీన్స్ లో మేము నటించము అంటూ చెప్పి బయటకు వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా సరే అలాంటి సీన్స్ లో నటిస్తూ ఉంటారు .

అయితే మొదటి కేటగిరీలోకి వస్తుంది మనం మాట్లాడుకోబోయే జయలక్ష్మి . సినిమా ఇండస్ట్రీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న తన నటనకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జయలక్ష్మి. పలు సినిమాలలో తల్లి, వదిన పాత్రల్లో నటించి కీలకంగా తన రోల్ ను మార్చుకున్న జయలక్ష్మి రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఆమె దాసరి నారాయణరావు గారి భార్య పద్మ రికమండేషన్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పుకు వచ్చింది . అంతేకాదు ఆమె రికమండేషన్ తోనే మోహన్ బాబు సినిమాలో ఛాన్స్ వచ్చింది అంటూ బయట పెట్టింది .

అయితే ఆ సినిమాలో ఆమెకు ఐఏఎస్ ఆఫీసర్ భార్యగా రోల్ అని చెప్పారని .. హుందా పాత్ర కావడంతో ఒప్పుకున్నాను అని .. ఆ తర్వాత కొన్ని ఇబ్బందికర సీన్స్ లో నటించమంటూ బలవంతం చేశారని.. పయట జార్చాలి అంటూ సీన్ ని వివరించారు అని ..అలా చేయను అని తెగేసి చెప్పేసాను అని.. అప్పుడే సినిమా నుంచి తప్పుకున్నాను అని .. ఆ టైంలో మోహన్ బాబు గారు నన్ను ఏమీ అనలేదు అని చెప్పుకు వచ్చింది . అంతేకాదు మోహన్ బాబు గారు ఏదైనా సెట్ లో ఇబ్బంది కలిగితే కోప్పడిపోతారు. కానీ నాపై మాత్రం అస్సలు అరవలేదు .. బహుశా నేను దాసరి నారాయణరావు గారి భార్య రికమండేషన్ తో వచ్చాను అని ఏమో అంటూ చెప్పుకు రావడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!