ఎల్లో షరారాలో కుర్రాళ‌ను కవ్విస్తున్న అదితీ రావు హైదారి.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

సౌత్ బ్యూటీ అదితి రావ్ హైదారి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎలాంటి పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాక తమిళ్‌లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అదితి డైరెక్టర్ మ‌ణిర‌త్నం సినిమాల్లో ఎక్కువగా కనిపించింది. చెలియా, సమూహనం, అంతరిక్షం, సైకో, హే సినామికా లాంటి ఎన్నో సినిమాలతో భారీ పాపులారి దక్కించుకుంది.

తాజాగా అదితి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ షరార సెట్ లో మరింత అందంగా మెరుస్తూ కనిపించింది ఈ బ్యూటీ. అదితి షేర్ చేసిన ఈ ఫొటోస్ నెటిజ‌న్లను ఆకట్టుకుంటున్నాయి. ఆమె పిక్స్ తో పాటు ఈ షరార కాస్ట్ పై కూడా వీక్షకుల కన్ను పడింది.

ఆ షరార కాస్ట్ ఎంత ఉంటుంది అనే విషయంపై నెట్లో సెర్చింగ్ మొదలు పెట్టగ దాని కాస్ట్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అక్షరాల దీని విలువ రూ.95,000 అని తెలిసి మైండ్ బ్లాక్ అయ్యిపోతుంది. చూడడానికి ఇంత సింపుల్గా ఉన్నా షరార కాస్ట్ అన్ని వేల అంటూ నోరెళ‌బెడుతున్నారు.