“బుద్దొచ్చింది.. తప్పు తెలుసుకున్నాను..క్షమించండి”.. చిరంజీవి పై చిన్ని కృష్ణ షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతూ ఉంటాయో ఎవరు చెప్పలేం. అప్పటివరకు జాన్ జిగిడి దోస్తులుగా ఉన్నవాళ్లు వెంటనే బద్ధ శత్రువులుగా మారిపోతూ ఉంటారు . అలాంటి సందర్భాలు మనం ఎన్నో ఎన్నో చూసాం .. విన్నాం. రీసెంట్గా చిన్నికృష్ణ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . నిజానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాకు కధ అందించింది చిన్నికృష్ణనే..

అయితే ఆ సినిమా అంత హిట్ అయినా సరే నన్ను పిలిచి భోజనం పెట్టలేదు అని.. నాకు సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు అని .. చిరంజీవి పై చిన్ని కృష్ణ గతంలో సంచలన ఆరోపణలు చేశాడు. అయితే రీసెంట్గా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంతో ఆయన చిరంజీవి ఇంట్లో మెగాస్టార్ ను కలిశారు . పాత గొడవలు ఏమాత్రం పట్టించుకోకుండా చిన్ని కృష్ణను మెగాస్టార్ రిసీవ్ చేసుకున్న పద్ధతి ఆయన మనసును హత్తుకునింది .

 

వెంటనే ఆయన చిరంజీవిని పొగిడేస్తూ ఆయన చేసిన తప్పుకు క్షమించమంటూ కోరారు . గతంలో మీపై ఎన్నో మాటలు మాట్లాడానని.. నా టైం బాగోలేని కారణంగానే అలా చేశాను అని .. కొందరు నాపై ఒత్తిడి పెంచి మిమ్మల్ని తిట్టించేలా చేశారు అని .. ఆయన చెప్పుకు రావడం గమనార్హం. అంతేకాదు నన్ను క్షమించండి అన్నయ్య అంటూ ఆయన బహిరంగంగా చిరంజీవిని క్షమాపణలు కోరారు . దీంతో మెగాస్టార్ మంచితనం మరోసారి వైరల్ గా మారింది..!!