ఈ ఏడాది ఆగస్టు 15 రిలీజ్ కోసం పోటీపడుతున్న సినిమాల లిస్ట్ ఇదే..

ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సెలవులు వచ్చిన వారంలో తమ సినిమాలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉంటే సినిమా కాస్త అటు ఇటుగా ఉన్న కలెక్షన్లు బాగా వస్తాయి అని ఆలోచనలో నిర్మాతలు ఉండటమే. అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ ఏడాది ఆగస్టు 15న‌ కూడా బాక్సాఫీస్ బరిలో పోటీపడనున్న సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Nani's Saripodhaa Sanivaaram launched in a Grand Manner

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న పుష్ప పార్ట్ 2.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా చాలా రోజుల క్రితమే ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది అంటూ వార్తలు జోరుగా వైరల్ అవ్వడంతో.. ముందు చెప్పిన తేదీనే సినిమా రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు.

Kamal Haasan-Shankar's Indian 2 revived with two major changes | Tamil News  - The Indian Express

ఇక ఈ లిస్టులో నాని హీరోగా తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా కూడా ఒకటి. దీన్ని కూడా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సింగం ఎగైన్, ఇండియన్ 2, కంగువ మూవీలు ఆగస్టు 15నే విడుదల చేసే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 5న కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది.