బాలయ్య కోసం ఆ పని చేయబోతున్న రష్మిక మందన్నా.. అంత విజయ్ దేవరకొండ దయ..!

ఇది నిజంగా రష్మిక మందన్నా అభిమానులకి షాకింగ్ గానే ఉండొచ్చు . నిన్న మొన్నటి వరకు నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో దున్నేసిన రష్మిక తన కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అది కూడా బాలయ్య సినిమాలో అంటూ ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ మరింత స్థాయిలో హర్ట్ అవుతున్నారు. బాలకృష్ణకి రష్మిక మందన్నాకి ఏజ్ చాలా చాలా తేడా ఉంది.

అయితే రష్మిక మందన్నా.. ఎందుకు ఆయన సినిమాలో ఐటమ్ సాంగ్ లో చిందులు వేయబోతుంది అనే విషయం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రష్మిక మందన్నా.. బాలయ్య – బాబి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో వచ్చే ఐటెం సాంగ్ లో జస్ట్ రెండుంటే రెండు సెకండ్ల పాటు అలాగే గెస్ట్ పాత్రలో కనిపించపోతుందట .

ఆమె ఫుల్ గా కూడా ఐటమ్ సాంగ్ చేయడం లేదట . ఈ సినిమాలు ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్స్ చేయబోతుందట . ఆమెతో పాటు రెండు స్టెప్పులు వేయడానికి ఆ క్రేజ్ పెంచడానికి రష్మిక మందన్నాను తీసుకొస్తున్నారట మేకర్స్ . విజయ్ దేవరకొండ సలహా మేరకే రష్మిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!