శ్రీమంతుడు వివాదం నుంచి మహేష్ ని తెలివిగా తప్పించిన నమ్రత.. ఏం చేసిందంటే..?

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొరటాల శివ మహేష్ బాబు కాంబోలో శ్రీమంతుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచి మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థల భాగంలో మహేష్ బాబుకు సంబంధించిన జిఎన్‌జి సంస్థ కూడా ఉండడంతో మహేష్ బాబును ఈ కేసు నుంచి తెలివిగా తప్పించేందుకు న‌మ్ర‌త మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌ట‌. అయితే నమ్రత మహేష్ ని తప్పించేందుకు ఏం చేసింది ఎలా మహేష్ కు ఇబ్బందులు రాకుండా చేశారో ఒకసారి చూద్దాం.

Telugu Movies on X: "Check out Mahesh Babu's #Srimanthudu Movie - Dialogues! http://t.co/CpezzVYDUo http://t.co/COqhxSZMds" / X

ఈ సినిమా కాపీరైట్స్ వివాదం మొదలైన తరువాత నమ్రత ఆ బ్యానర్లో మహేష్ బాబు పేరుని తప్పించి గంగాధర్ అనే వ్యక్తి పేరును చేర్చింది. నమ్రత తెలివిని ఉపయోగించి ఈ విధంగా చేయడం వల్ల మహేష్ బాబుకు ఇబ్బందులు రాకుండా శ్రీమంతుడు వివాదం బాధ్యత అంతా కొరటాల శివ పై పడిందని సమాచారం. మరోవైపు కొరటాల శివ ఈ కేసు నుంచి బయటపడే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక‌ మహేష్ సర్కార్ వారి పాట‌, గుంటూరు కారం సినిమాలతో సక్సెస్‌ అందుకున్న ఆ సినిమాల్లో మహేష్ తేంజ్ హిట్ ఒకటి కూడా పడలేదు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి కాంబో కోసం స్క్రిప్ట్ తయారవుతుంది.

Namrata Shirodkar Reject | Mahesh Babu Request | Superstar Son Daughter - Filmibeat

ఈ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని.. మహేష్ బాబుకు కూడా స్క్రిప్ట్ బాగా నచ్చిందని సమాచారం. మహేష్ బాబుకు రాజమౌళి సినిమా కోసం మూడు, నాలుగు ఏళ్ల సమయం పడుతుందట. దీంతో మ‌హేష్ కెరీర్ కు నష్టమని రాజమౌళి సినిమా తర్వాత మహేష్ వేగంగా సినిమాలు చేయాల్సి ఉంటుందని నెటిజ‌న్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం లుక్స్ కూడా మార్చుకునే పనిలో బిజీ అయ్యాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు కండలు పెంచుతూ జిమ్‌బాడిని తయారు చేయబోతున్నాడని ఇండస్ట్రీ వార్గాల టాక్‌. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇకపై భారీ సినిమాల్లో మాత్రమే నటించనున్నాడని తెలుస్తుంది.