బాలయ్య – ఏఎన్ఆర్ తో కలిసి ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ తారకరామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నాడు. తండ్రి అడుగుజాడల్లో న‌డుస్తూ.. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న బాలయ్య.. ఇప్పటికే కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలలో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం వరుస హ్య‌ట్రిక్‌ క్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలు అందరిలోనూ సినిమాల ప‌రంగా బాలయ్య టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు.

ఇటీవల ఆయన నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవడంతో మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. కాగా బాలయ్య సినీ కెరీర్ స్టార్టింగ్ లో తండ్రి తో పాటు దాదాపు అప్పటి స్టార్ హీరోలు అందరితోను మల్టీ స్టార‌ర్ సినిమాల్లో నటించాడు. అలా ఏఎన్నార్ తో కలిసి బాలయ్య రెండు సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు ఏంటో.. వాటి రిజల్ట్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందా.

1985లో వి.బి రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన భార్యాభర్తల బంధం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి బాలకృష్ణ నటించాడు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన రాధ, అక్కినేని నాగేశ్వరరావు సరసన జయసుధ నటించిన మెప్పించారు. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. అలాగే ఏఎన్ఆర్ తో గాండీవం సినిమాలో కూడా నటించాడు బాలయ్య. 1994 – 18 – ఆగష్టున తెరకెక్కిన ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకుడిగా వ్యవహరించాడు. టాలీవుడ్ సీనియర్ బ్యూటీ రోజా ఈ సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమా అప్పట్లో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.